జిల్లాస్థాయి యువజనోత్సవాలు విజయవంతం చేయండి!

Spread the love

Make district level youth festivals a success!

జిల్లాస్థాయి యువజనోత్సవాలు విజయవంతం చేయండి!
యువజన సంఘాల సమితి ఖమ్మం జిల్లా.

ఖమ్మం బ్యూరో చీఫ్:

26వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జిల్లాస్థాయి యువజనోత్సవాలను జనవరి 4వ తేదీన భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు కోడిరెక్క ఉమాశంకర్ తెలియజేశారు.

దీనిలో భాగంగా 15 సం. నుండి 25 సం. లోపు వయసుగల యువతీ యువకులు జానపద నృత్యం గ్రూప్ జానపద గేయాలు గ్రూపు మరియు వక్రుత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతితో పాటు తెలంగాణ ప్రభుత్వం

యువజన సర్వీసుల శాఖ నుండి ధ్రువపత్రం ఇవ్వడంతో పాటు వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని కావున యువ కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యువజనోత్సవాలను విజయవంతం చేయగలరని ఖమ్మం జిల్లా యువజన సంఘాల సమితి కమిటీ కోరుతున్నది వివరాలకు జిల్లా యువజన క్రీడల కార్యాలయం నెంబరు 9948207271 సంప్రదించగలరని తెలియచేసారు.


ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ పల్లిపాడు అధ్యక్షులు తాటిపల్లి సుదీర్, బానోదయ యువజన సంఘం అధ్యక్షులు నాళ్ళ భానుచందర్, నవయువ సంఘం కందుకూరి శ్రీరామ్ స్వేచ్చా యూత్ గోగుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page