SAKSHITHA NEWS

Grievance Day applications should be dealt with expeditiously by the authorities

గ్రీవెన్స్ డే దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి.
-అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

గ్రీవెన్స్ డే దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డే ను పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన సరస్వతి భూమిరాజు, వృద్దాప్య పెన్షను పొందుటకు వేలి ముద్రలు పడటం లేదని, కళ్ళు కనిపించడం లేదని, ప్రత్యామ్నాయానికి కోరగా, డిఆర్డీఓ ని తగుచర్యలకై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదేశించారు.

వైరా మండలం సిరిపురం గ్రామం నుండి గుండ్ల ఉషారాణి తనకు ఆయా ఉద్యోగం ఇప్పించుటకు కోరగా, అదనపు కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారికి పరిశీలనకై ఆదేశించారు. వేంసూరు మండలం దుద్దేపుడి గ్రామం నుండి సీఆర్పీఎఫ్ జవాన్ జుంజునూరు రఘు, తనకు సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి గ్రామ రెవిన్యూ సర్వే నెం. 132/అం/అ/3 లో 5 ఎకరాల వ్యవసాయ భూమికి ఇబ్బందులు కల్గించి, తనకు అన్యాయం చేస్తున్నట్లు, న్యాయం చేయాలని కోరగా, సత్తుపల్లి తహసీల్దార్ ను తగుచర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం నగరం కవిరాజ్ నగర్, డివిజన్ 11, రోడ్ నెం. 9 లో ఒక పురాతన ఇంట్లో దాదాపు 45 సంవత్సరాల 75 అడుగుల పెద్ద చెట్టు ఉందని, దాని కొమ్మలు భారీగా పెరిగి మనుషుల మీద పడడం జరుగుతుందని, ఇంటి ప్రహారి గోడ శిథిలావస్థకు చేరిందని, ఇంటి యజమాని పట్టించుకోవడం లేదని కాలనీ వాసి టి. రాములు దరఖాస్తు చేయగా, తగు చర్యలకై మునిసిపల్ కమీషనర్ ని అదనపు కలెక్టర్ కోరారు.

చింతకాని మండలం నాగులవంచ లో అడపా బోసు మామిడి తోట నుండి 2 కి.మీ. వరకు 2012 లో రోడ్డు నిర్మాణం చేశారని, అట్టి రోడ్డు కిరువైపుల కంపలు పెరిగి రోడ్డుపై వెళ్ళడానికి ఇబ్బంది గా ఉందని గ్రామస్థులు కొమ్మినేని అప్పారావు, వెంకటేశ్వరరావు లు దరఖాస్తు చేయగా, జిల్లా పంచాయతీ అధికారిని తగు చర్యకై ఆమె ఆదేశించారు. కొనిజర్ల మండలం తనికెళ్ల నుండి కొర్లకంటి రాణి, దళితబంధు మంజూరుకు కోరగా, ఇడి, ఎస్సి కార్పొరేషన్ ను తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు.

కొనిజర్ల మండలం గుబ్బకుర్తి నుండి తంబల్ల లాజర్ తన పోడు భూమి సర్వే కోసం దరఖాస్తు ద్వారా కోరగా, తగు చర్యలకై ప్రత్యేక అధికారిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో పనిచేయుచున్న మల్టీ పర్పస్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి మల్టీ పర్పస్ వర్కర్లు కోరగా, పరిశీలించి చర్యలు తీసుకోవాలని జెడ్పి సిఇఓ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

తనికెళ్ల ఎస్సి కాలనీ నుండి రెడపంగి కమలమ్మ తమ ఇంటి ప్రక్కన శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాoకు కూలుటకు సిద్ధంగా ఉందని చర్యకై కోరగా, తగుచర్యకై జిల్లా పంచాయతీ అధికారిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం పాతర్లపాడు నుండి కోవూరి రమాదేవి, తనకు దళితబంధు మంజూరుచేసి, రెడీమేడ్ బట్టల షాపు యూనిట్ మంజూరు

చేయగలందులకు దరఖాస్తు చేయగా, ఇడి ఎస్సి కార్పొరేషన్ కు పరిశీలనకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. బాహ్మణపల్లి ఏజీ వైరా, వైరా మండలం నుండి కన్నెగంటి సాయిరాం తనకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా పోలీస్ ఈవెంట్ శిక్షణ ఇప్పించుటకు దరఖాస్తు చేయగా, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారిని తగుచర్యకై ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS