ఏజెన్సీ ఏరియాలో ఫైనల్ పట్టాలు ఉన్న ఆదివాసి గిరిజన భూములలో హరితహారం మొక్కలు వేస్తున్న వైనం
👉ఆదివాసి గిరిజనులు ఇళ్ల స్థలాల కోసం ఉంచుకున్న భూమిలో మొక్కలు నాటుతున్న అధికారులు
👉మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మొక్కలు నాటమని చెబుతున్న గ్రామస్తులు
👉ఫైనల్ పట్టాలు ఉన్న వాటిని తుంగలో తొక్కి మొక్కలు పెట్టేందుకు సిద్ధం
అశ్వారావుపేట, ఏప్రిల్ -04,(సాక్షిత న్యూస్
భద్రాద్రి ఇంచార్జ్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని వినాయకపురం పంచాయతీ దగ్గర్లో ఉన్న ఎర్రగుంటపల్లి గ్రామం ప్రజలు ఎన్నాళ్లకు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మీకు ఇళ్లస్థలం చూపిస్తామని చెప్పి చాలా కాలమైందని గ్రామ ప్రజలు వాపోతున్నారు వాళ్లు చూపించకపోగా వాళ్ల సొంత పట్టాలైనా వాటిలో ఇళ్ల స్థలాలు కట్టుకుందామని వాళ్ళు చూస్తుంటే అధికారులు ఆ స్థలంలో హరితహారం మొక్కలు నాటుదామని ప్రయత్నిస్తున్నారు ఆ స్థలానికి ఫైనల్ పట్టా కూడా ఉంది ఆ ఫైనల్ పట్టాలో ఉన్న పేరు సరియం లచ్చమ్మ ఆమె భర్త పేరు ముత్యాలు అనే పేరు మీద ఫైనల్ పట్టా ఉంది వీళ్లు రసీదులు కూడా కట్టుకున్నారు ఇవి ఉన్నా కూడా అధికారులు హరితహారం మొక్కలు నాటడానికి సిద్ధపడుతున్నారు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరు మొక్కల నాటమని ధర్నాకు దిగినారు అధికారులు కూడా మీకు ఇళ్ల స్థలాలు చూపిస్తామని చెప్పి ఇంతవరకు చూపించపోగా మా సొంత స్థలంలో హరితహారం మొక్కలు పెడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఆదివాసి గిరిజన బిడ్డలంటే ఏమైనా చేయొచ్చు అనే ధైర్యంతో ఫైనల్ పట్టాలన్న పొలాలలో హరితహారం మొక్కలు నాటుతున్నారు అని గ్రామస్తులు వాపోతున్నారు ఎలక్షన్ టైంలలో మా ఓట్లు కావాలి ఇప్పుడేమో మాకు ఉన్న ఆస్తులు కొల్లగొడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఇల్లు కట్టుకోవాలనుకునే ఇళ్ల స్థలాల్లోనే హరితహారం మొక్కలు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇళ్ల స్థలం చూపించి మీరు హరితహారం మొక్కలు పెట్టమని అధికారులకు గ్రామస్తులు గూడు వెళ్లబుచ్చుకుంటున్నారు ఈ ధర్నాలలో పాల్గొన్న గ్రామస్తులు పిల్లలు పెద్దలు.