ఎర్రగుంటపల్లి గ్రామం ఈ గ్రామం పేరు చెప్తే దాదాపుగా ఎవ్వరికీ తెలియదు

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామపంచాయతీ ఎర్రగుంటపల్లి గ్రామం ఈ గ్రామం పేరు చెప్తే దాదాపుగా ఎవ్వరికీ తెలియదు…
ఎందుకంటే అడవిలో ఎక్కడో విసిరి పడేసినట్టుగా ఉంటుంది. మా గ్రామానికి ఓ బడి లేదు అంగన్వాడి సెంటర్ లేదు….
మా గ్రామంలో సుమారు 100 ఇల్లు ఉన్నాయి…
జనాభా 400 వరకు ఉంటారు..
అరకొర సౌకర్యాలతో బతికీడ్చుకుంటూ ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలు జీవనం వెల్లదిస్తున్నాం…
ఒకప్పటి ప్రభుత్వ స్థలంలో మాకు ఇల్లు నిర్మాణం కావాలి అంటూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం…
ఫారెస్ట్ అధికారులు ఆ భూమి మా పరిధిలో ఉంటుంది అంటారు….
కాదు కాదు ఆ భూమి మా పంచాయతీ పరిధిలో ఉంది అంటూ పంచాయతీ అధికారులు బెదిరిస్తున్నారు…
స్థానిక ఎమ్మెల్యే అయిన మెచ్చ నాగేశ్వరావు గారిని అనేక పర్యాయాలు కలిసి మా గోడును విన్నవించుకున్నాం…. ఎమ్మెల్యే గారిని కలిసిన ప్రతి సందర్భంలోనూ మంచిగా స్పందించి ఫారెస్ట్ అధికారులు పిలిపించి వీరి సమస్యను పరిష్కరించండి అంటూ ఆదేశాలు జారీ చేసిన… ఫారెస్ట్ అధికారులు పెడచెవ్వున పెడుతున్నారు…
మా సమస్యలు పరిష్కరించండి…
మాకు ఇంటి స్థలం ఇప్పించి ప్రభుత్వ పక్కా ఇల్లు నిర్మించండి అంటూ దీక్షలకు దిగిన… మా గోడు సమాజానికి వినిపించడంలా… కనిపించడంలా…
ఎందుకంటే పట్టణాల్లో ఉండే అధికారులు పెద్దగా మాకు తెలియదు… మా సమస్యలను సీఎం కేసీఆర్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లే విధంగా సహకరించే పత్రిక మీడియా ప్రతినిధులతో పరిచయాలు లేవు… ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితి మాది…
ఈ మెసేజ్ ని చూసిన ప్రతి ఒక్కరు మా సమస్యను అధికారుల దృష్టికి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి… సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా సహకరించగలరని ప్రాధేయ పడుతున్నాం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page