హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లలో పచ్చదనం పరిఢవిల్లడానికి హరితహారం ఎంతగానో దోహదపడుతుంది అని, ఈ రోజు హరితహారం నిర్వహించడం జరిగినది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకుపచ్చని తెలంగాణా లక్ష్యంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరితహారం తో తెలంగాణ లో అడవుల శాతం పెరిగినది అని,
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి-వాటిని కాపాడాలిఅని, మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారం మొక్కలు అని ,కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసునని కావున దీనిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని , మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా,అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి అని ,నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలని, మొక్కలు నాటాడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి,తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, ఎల్లం నాయుడు, MD ఇబ్రహీం, మహేందర్ నాయక్ ,సుహాష్, దుర్యోధన్ రావు, లక్ష్మీనారాయణ, బాలు, కుమార్ యాదవ్,ఆనంద్ రాజు ,శెట్టి పద్మ ,కవిత, బేబీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు .

Related Posts

You cannot copy content of this page