Govt is big for the welfare of the poor…
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
రూ.25 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 59 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.25,0,1500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు