యోగాలో మెడల్స్ సాధించిన చిన్నారులను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

యోగాలో మెడల్స్ సాధించిన చిన్నారులను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగ కేంద్రం చిన్నారులు జాశ్విన్, సాహితీ, మానస లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కేపీహెచ్బీ కాలనీలో జరిగిన యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చి మెడల్స్ సాధించారు. ఈరోజు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జాశ్విన్ కు గోల్డ్, సాహితి, మానస కు సిల్వర్ మెడల్స్ ను అందజేసి అభినందించారు. భవిష్యత్ లోనూ జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. అదే విధంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు మల్లేష్, విజయ్ కుమార్, సంపత్ గౌడ్, హరికృష్ణ, సింధు, సంతోష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page