అర్హులందరూ పథకాలు వినియోగించుకోవాలి…*
నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు వచ్చి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోలేని వారు కూడా అధికారులకు వారి సమస్యలపై,పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తర్వాత రోజుల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు గ్రామ పంచాయతీ సిబ్బంది వారి వివరాలను సమగ్రంగా నింపి అధికారులకు పంపడంలో సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాన్సిలాల్, ఎంపీఓ హరి శంకర్ గౌడ్,స్పెషల్ ఆఫీసర్ మల్లయ్య, ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్ రెడ్డి,ఈఓ కవిత, ఎంపీటీసీలు,ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.