SAKSHITHA NEWS

Good morning Alvin Colony. గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ.. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని కమలమ్మ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ కాలనీలో కొన్ని చోట్ల డ్రైనేజీ లైన్స్ నూతనంగా నిర్మిచాల్సి ఉందని, పాత డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండి ప్రతి రోజు నిండి పోతుందని..అలాగే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యలను గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. విరిగిన మ్యాన్ హోల్ మూతలను తక్షణమే మార్చి కొత్తవి వెయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, రాములుగౌడ్, ప్రదీప్ రెడ్డి, వాసుదేవరావు, నరసింహులు, సిద్దయ్య, కమలమ్మ కాలనీ అధ్యక్షుడు రాజుపాటేల్, వాలి నాగేశ్వరరావు, రవీందర్, గంగాధర్, కృష్ణారావు, మురళి, భీమ్ సాగర్, మల్లేష్, వెంకటేశ్వర్లు, దశరథ్, ప్రకాష్, నరసింహారెడ్డి, జాన్, విక్రమ్, శివశంకర్, ఎజ్జస్, SFA మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.