గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..

Spread the love

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..

యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ పరిసర ప్రాంతాలలో తెరాస పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ కాలనీలో సమస్యలను తెలుసుకొని గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా సమస్యలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తామని తెలియజేశారు. కాలనీలో డ్రైనేజీ పనులన్నీ పూర్తయ్యాయి, కొన్ని చోట్ల రోడ్లు మంజూరై పనులు పెండింగులో ఉన్నాయని అవి కూడా వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తారని అన్నారు. మంజీరా వాటర్ సమస్య కూడా ఉందని కొంతమంది తెలుపగా తక్షణమే జలమండలి వారితో ఫోన్లో మాట్లాడి పరిష్కారించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, జగదీష్, శివరాజ్ గౌడ్, నిరంజన్ గౌడ్, వెంకటేష్, శంకర్ గౌడ్, వాసుదేవరావు, మోజెస్, బాలస్వామి, యాదగిరి, రాజుపటేల్, రవీందర్, కూర్మయ్య, సంతోష్, మహేష్, ఇంతియాజ్, అశోక్, మధుసూదన్ రెడ్డి, మురళి కృష్ణ, శరణప్ప, ఎం.డి మోసిన్, విరేశం, ధనుంజయ్, సత్యనారాయణ, ఆంజనేయులు, రవిరాజా, అనంతం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page