ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8. 73 కోట్ల విలువైన బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం.

Spread the love

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా చెక్ పోస్ట్ బృందం పట్టుకొని సీజ్ చేసినట్లు రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి అంబికా ప్రసాద్ తెలిపారు. రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించి, స్వాధీనం చేసుకుని ట్రెజరీలో భద్రపరిచారు. రాజమండ్రి ప్రముఖ నగల దుకాణానికి తీసుకు వెళ్తున్నట్టుగా గుర్తించారు. ధవళేశ్వరం సిఐ జివి వినయ మోహన్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కు సమాచారం తెలియజేశారు. వారి ఆదేశాల ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రూరల్ మండలం తహసీల్దార్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జ్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ డి. గోపాలరావు బృందం, ఇన్కమ్ టాక్స్, జిఎస్టి అధికారుల బృందాలు చెక్పోస్ట్ వద్దకు చేరుకుని అధికారులందరి సమక్షంలో కంటైనర్ను సిబ్బంది సమక్షంలో ఓపెన్ చేసి పరిశీలించి ఆభరణాలు రవాణా చేస్తున్నట్టుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశాల ప్రకారం ఆభరణాలను జిల్లా ట్రెజరీలో భద్రపరచడం తెలిపారు.

Related Posts

You cannot copy content of this page