తెలంగాణ వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా వెంటనే కల్పించండి

Spread the love

తెలంగాణ వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా వెంటనే కల్పించండి,,,,

తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం సిఎస్ కు విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించాలని 2017 సంవత్సరము నుండి అడగడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం పక్షాన అప్పటి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఏ అనిల్ కుమార్ కు రిప్రజెంటేషన్ సమర్పించగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అప్పటి అజయ్ మిశ్రాకు పంపించడం జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వకపోవడం చాలా అన్యాయమని శనివారం రోజు టీఎన్జీవోస్ భవనములో జరిగిన ఉద్యోగుల సమావేశంలో తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తోపాటు సంఘ నాయకులు జి బిక్షపతి ఏ అనిల్ కుమార్ శంకర్ సారయ్య ఎం ఏ భారీ ముత్యం రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ హోదా ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వానికి ఖజానాపై ఎటువంటి భారం పడదు అని ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 లో కోపరేటివ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ డిప్యూటీ తాసిల్దార్ సబ్ ట్రెజరీ అధికారి మున్సిపల్ కమిషనర్ ఇలాంటి అధికారులందరూ గజిటెడ్ హోదాలో కొనసాగుతుండగా ఒక వాణిజ్య పనుల ఏ సి టి ఓ లకు గ్రూప్ 2 పరిధిలో ఉన్నప్పటికీ వీరిని ఈ వాణిజ్య పనుల శాఖలో ఏ సీటీఓలకు గెజిటెడ్ హోదా ఇవ్వకుండా నాన్ గెజిటెడ్ హోదా కింద ఏ సిటీవోలు పనిచేస్తున్నారని అందుకే ఇతర శాఖలలో పనిచేస్తున్న అధికారులందరికీ గజిటెడ్ హోదా ఇచ్చినప్పుడు వాణిజ్య పనుల శాఖలు పనిచేస్తున్న ఏ సి టి ఓ లకు కూడా గెజిటెడ్ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి ఐఏఎస్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక శాఖ జేఏడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ పిఆర్సి కమిషన్ ఇంతమంది అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ కు లేఖలు రాయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు 8 సంవత్సరాల నుండి వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించలేదు చాలా అన్యాయం అని తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ సెక్రెటరీ రాంసింగ్ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతు కుమారి ప్రసాద్ ఐఏఎస్ చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా జీవోను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర టీసీటీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వీరందరినీ విజ్ఞప్తి చేశారు.

Related Posts

You cannot copy content of this page