డబల్ బెడ్రూంలైనా ఇవండి లేక 60 గజాల స్థలమైన ఇవ్వండి*

Spread the love

వెరిఫికేషన్ పూర్తి కాకముందే ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చెయ్యడం దారుణం.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సీపీఐ మేడ్చల్ జిల్లా పార్టీ ఇచ్చిన పులుపులో భాగంగా నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్, దుందిగల్ మండల కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించి స్థానిక అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ ధర్నాలకు ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేహ్ పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారమే సుమారు 20 వేల మంది ఫోన్లు కలవకపోవడం,చిరునామా మారిపోవడం లాంటి జరగడం వల్ల వెరిఫికేషన్ కాలేదని అలాంటిది అట్టి దరఖాస్తు దారులను ఎలా తొలగించి మిగిలిన వారిలో నుండే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

అధికారుల లెక్కలే కాకుండా మరో 10 వేల మంది ప్రజలకు ఫోన్లు రాలేవని కేవలం అధికారులు బస్తీలకు వచ్చి ఒక్క ప్రాంతంలో కూర్చొని అక్కడ కొంతమందిని వివరాలు అడిగి, ఆ బస్తీలో ఉన్న వారిని నిజమా కాదా అని అడగడం లాంటివి నిజమైన పరిశీలన క్రిందికి రాదని,దీని వల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోయ్యారని అన్నారు.


స్వయంగా అధికారులే, ప్రజా ప్రతినిధులే ఇండ్లు ఉన్న వారికి కూడా డబల్ బెడ్రూంలు వచ్చాయని అనడం చూస్తుంటే డబల్ బెడ్రూం ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరూపితమైందని కావున ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో కాకుండ చిత్తశుద్ధితో అసలు లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో వివిధ కారణాల వల్ల స్వయంగా కలెక్టర్ స్థానిక తహశీల్దార్ కి కొంతమందికి డబల్ బెడ్రూం లో రిజర్వేషన్ పేరుతో లిస్ట్ ఇస్తే వాటిని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.ఎంపికలో నిజమైన కార్మికులు ఏమిలేని వారికి రాకపోవడం,ముఖ్యంగా పేద ప్రజలకు రాకపోవడం దారుణమని ప్రభుత్వానికి అందరికి ఇండ్లు కట్టించే స్తోమత లేకుంటే ప్రభుత్వ స్థలాలను పంచాలని డిమాండ్ చేశారు.

కబ్జాదారులు విచ్చలవిడిగా అధికారులను సైతం భయబ్రాంతులకు గురిచేసి ఇండ్లు కట్టుకుంటే కబ్జాదారులను ఏమి అనని అధికారులు పేద ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. కొంతమంది ఎమ్మార్వో కార్యాలయం దగ్గర లిస్టులో తమ పేరు ఉన్నప్పటికీ తమకు ఫోన్ లు చేయలేదని అధికారులు అందుబాటులో లేరని ఎవ్వరిని అడిగినా తమకు తెలియదని చెపుతున్నారని సీపీఐ నాయకులకు తెలియచేసారు.


ఇలా లిస్టులో ఉన్న పేరు వారిని పిలవకపోవడం అవినీతిని సూచిస్తుందని వీటి పై సత్వరమే విచారణ జరిపి తగు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ మండలం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి,నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్,సిపిఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య,కోశాధికారి సదానంద్, కార్యవర్గ సభ్యుడు రాములు, కృష్ణ,శ్రీనివాస్,శాఖ కార్యదర్శి సాయిలు, సహదేవ్ రెడ్డి,జవీద్,నాయకులు రాకేష్, ప్రభాకర్,ఇమామ్,సామెల్,రవి,యాదగిరి, మల్లేష్, భీమేశ్, స్వరూప, మల్లమ్మ,
నాగమ్మ పాల్గొన్నారు
దుందిగల్ మండల కార్యక్రమంలో మండల కార్యదర్శి పర్వీనా బేగం, జిహెచ్ఎంసి అధ్యక్షుడు రాములు, మహిళా సంఘం నాయకురాలు నసీరా బి, తాహెరా, ప్రభాకర్,శ్యామ్, జుబేర,భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page