SAKSHITHA NEWS

Gill, who scored a double century, broke Sachin’s record at Uppal Stadium

డబుల్ సెంచరీ కొట్టేసిన గిల్.. ఉప్పల్ స్టేడియంలో సచిన్ రికార్డు‌ను బ్రేక్ చేశాడుగా..


హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. తనదైన ఆటతో అభిమానులకు మాంచి కిక్ ఇచ్చాడు.

తొలుత సెంచరీ, ఆ తర్వాత డబుల్ సెంచరీతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. చివర్లో వరుస సిక్సులతో బౌలర్లకు చుక్కలు చూపించిన గిల్.. డబుల్ సెంచరీ చేశాక పెవిలియన్ చేరాడు. దీంతో కెరీర్‌లో ఎన్నో మైళురాళ్లను తన పేరుతో లిఖించుకున్నాడు.గిల్ 208(149 బంతులు, 19 ఫోర్లు, 9 సిక్సులు) పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 139 స్ట్రైక్ రేట్‌తో బౌండరీలు బాదేసిన గిల్.. చివరి ఓవర్లో ఔటయ్యాడు.

ఈ క్రమంలో వన్డేల్లో అతి తక్కువ ఏజ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు…డబుల్ సెంచరీ కొట్టేసిన గిల్.. ఉప్పల్ స్టేడియంలో సచిన్ రికార్డు‌ను బ్రేక్ చేశాడుగా..


SAKSHITHA NEWS