గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో రెండు కుటుంబాల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం

Spread the love

గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో రెండు కుటుంబాల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం

రెండు కుటుంబాల వ్యధ లను తోలగించి నవ వసంతం నింపిన ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం

విధి వెక్కిరించిన ఒక కుటుంబ దీన గాథ. అగవైకల్యం తో ఉన్న ఆత్మ విశ్వాసం తో కష్టపడుతున్న ఒక యువతి మనో వ్యధ. ఈ రెండు కుటుంబాల వ్యతలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శాశ్వత పరిష్కారం చూపారు. ఇబ్రహింపట్నం పరిధిలో జరుగుతున్న గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా ఆ రెండు కుటుంబాల విధి రాతను మార్చే ప్రయత్నం చేశారు.వివరాలలోకి వెళితే ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయం ఎదురు రోడ్డు లో అంగవైకల్యం తో ఉన్న ఒక యువతి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా ఒక షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.అది చూసిన ఎమ్మెల్యే వసంత వికలాంగురాలి ఆత్మ విశ్వాసానికి ముగ్ధుడై కాసేపు ఆమెతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె ఒక సమస్యను ఎమ్మెల్యే వసంత దృష్టికి తీసుకొచ్చారు.తనకి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ వస్తుందని అయితే పించన్ తో పాటు ఒక చిన్న బడ్డి కొట్టు నిర్వహిస్తున్నామని కానీ బడ్డీ కొట్టు కారణంగా నా పించన్ పోయే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.బడ్డీ కొట్టు నిర్వహణ కోసం వినియోగించే కరెంట్ ను కమర్షియల్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అలా చేస్తే ప్రభుత్వం ఇచ్చే పించన్ కు అనర్హురాలిని అవుతానని తన గోడు ఎమ్మెల్యేకు చెప్పుకొచ్చింది.యువత కష్టాన్ని నేరుగా చూసిన ఎమ్మెల్యే వసంత తక్షణమే అధికారులకు పలు సూచనలు చేశారు. తనకి ఎలాంటి కష్టం వచ్చినా తక్షణమే నాకు ఫోన్ చేయాలని ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఆ యువతికి ఇచ్చి భరోసా కల్పించారు.విధి వెక్కిరించిన మరో కుటుంబానికి గృహ నిర్మాణ పనులకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఒక్కసారిగా అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు.ఎమ్మెల్యే వసంత కష్టపడి జీవించే వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది వికలాంగురాలి పట్ల ఆయన చూపిన శ్రద్ధ నిదర్శనంగా నిలుస్తోంది.

Related Posts

You cannot copy content of this page