SAKSHITHA NEWS

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీ లో SLG ఆసుపత్రి వారి ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలతో కూడిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం చాలా అభినదనియం అని, ఇక్కడి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,ఈ శిబిరం ఏర్పాటు చేసిన SLG ఆసుపత్రి యాజమాన్యం కు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు ఇందులో భాగంగా.జనరల్ మెడిసిన్ సంబంధించిన వైద్యులు ,స్త్రీల వైద్యులు , చిన్న పిల్లల వైద్యులు,ఎముకలకు సంబంధించిన వైద్యులు, చర్మ వైద్యులు, నేత్ర వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరిక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం అభినందనీయం అని, ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు .ఈ సందర్భంగా డాక్టర్లను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది . ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్,గైనకలజీ,ఆర్థో,ECG,ENT, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్సరే అర్హులైన వారికి ఉచిత కళ్ళజోడులు, ఉచిత మందులు పంపిణీ వంటి మొదలగు సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగినది అని ,పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం చాలా అభినందనియమని ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయం అని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొనడం జరిగినది .మానవతా దృక్పతం తో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం అని ,ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యము పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు. ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది. ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని అంతే కాకుండా సీజనల్‌ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు.

ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డీవీఎస్ సోమ‌రాజు మాట్లాడుతూ ఈ శిబిరంలో ముఖ్యంగా
జ‌న‌ర‌ల్ మెడిసిన్, కార్డియాల‌జీ, ఆర్థోపెడిక్, డెంట‌ల్, కంటివైద్య ప‌రీక్ష‌లు కూడా చేశామని. ఎక్కువ‌మందికి ర‌క్త‌పోటు, మ‌ధుమేహం, ఈసీజీ, 2డి ఎకో త‌దిత‌ర ప‌రీక్ష‌లు చేశారు. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ల‌క్ష మందికి ఏడాదికాలంలో ఉచితంగా ఈసీజీ ప‌రీక్ష‌లు చేసి, ఈ ప‌రిస‌రాల‌ను గుండెవ్యాధుల ర‌హితంగా చేయాల‌న్న ల‌క్ష్యంలో భాగంగానే ఈ శిబిరం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డీవీఎస్ సోమ‌రాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలోజ‌న‌ర‌ల్ మెడిసిన్ విభాగం నుంచి డాక్ట‌ర్ స‌బీల‌, ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అజ‌య్, మరియు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

F6fe1e94 D4c0 415e 94f9 A77d0a5a4040

SAKSHITHA NEWS