వెల్వడంలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం.
మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ప్రవాసాంధ్రులు, దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి సౌజన్యంతో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సోమవారం శంకుస్థాపన చేశారు.
డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి తో పాటు, ఎల్.బి.ఆర్.సి.ఈ ఛైర్మన్ డాక్టర్ లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు తో పాటు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ స్వగ్రామమైన వెల్వడం అభివృద్ధికి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం అన్నారు.
డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు కృష్ణప్రసాదు నాయకత్వం మైలవరం నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరం అన్నారు. రానున్న ఎన్నికల్లో వెల్వడం నుంచి అందరూ ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు.