SAKSHITHA NEWS

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: గద్వాల్ సి. ఐ. చంద్రశేఖర్ .

జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు
జిల్లా కేంద్రం లోని చింతల పేట కాలనీలో సాయంత్రం 5 గంటల నుండి 07 గంటల వరకు గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ లు-05, ఏఎస్ఐ -04, HC లు 05, పిసిలు 25, స్పెషల్ పార్టీ సిబ్బంది మొత్తం 42 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

నాలుగు పార్టీలుగా విడిపోయి నాలుగు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి, వారిని పేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా, వారి వేలిముద్రలు తీసుకొని వారిపై గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని చెక్ చేసి 230 ఇళ్లను సోదాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు చూయించి తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా సి. ఐ మాట్లాడుతూ…. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం అన్నారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.


ప్రజలు, మహిళలు ఆపద సమయంలో, ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులు గా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. వ్యాపార సముదాయాల దగ్గర, కాలనీ లలో, గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎవరైనా దొంగతనాలు చేయడానికి అయినా, అమ్మాయిలను, మహిళలను వేధించాలన్న, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి భయపడతారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పి తెలిపారు. మీ కాలనీ లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.


SAKSHITHA NEWS