హైదరాబాద్ :
శామీర్ పేట ఓఆర్ఆర్పై నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి ఒక కారుతో పాటు మరో వాహనాన్ని ఢీకొట్టింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇక లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో క్లీనర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ నుంచి కీసర వెళ్తున్న లారీ వాహనాలను ఢీ కొని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు….
శామీర్ పేటలో ఓ ఆర్ ఆర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం
Related Posts
సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!!
SAKSHITHA NEWS సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!! తెలంగాణ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి…
చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..!!
SAKSHITHA NEWS చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..!! BRS Protest: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే…