SAKSHITHA NEWS

ఆక్వా రైతుల సమస్యలు పై సాధికార కమిటీ సమావేశం

  • సాక్షిత : విజయవాడలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు *
    కమిటీ సభ్యులు ఇంధన శాఖ, మైన్స్ & జియాలజీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , వి రఘురామ్- వైస్ చైర్మన్ అప్సడా,ప్రధాన కార్యదర్శి,ప్రత్యేక కార్యదర్శి ఎన్విరాన్‌మెంట్ & ఫారెస్ట్, ప్రత్యేక కార్యదర్శి పశు సంవర్ధక మరియు మత్స్య పరిశ్రమ,ప్రత్యేక కార్యదర్శి ఎనర్జీ, మరియు కమిషనర్ ఫిషరీస్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు .

ఈసమావేశంలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఆక్వా ఫీడ్ ధరలలో నిరంతర పెరుగుదలకు సంబంధించి,రొయ్యల సేకరణ ధరల్లో భారీ తగ్గింపు,ఆక్వా పవర్ సబ్సిడీ అమలుకు సంబంధించిన సమస్యలు కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు.

గతంలో రొయ్యల మేత రేట్లను నియంత్రించేందుకు శాఖాపరమైన ప్రయత్నాలు చేయడం జరగగా.. ఇందులో డిపార్ట్‌మెంట్ ఫీడ్ తయారీదారులు మరియు ప్రగతిశీల ఆక్వా రైతులతో అనేక సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈవిధంగా ఫీడ్ ధరలపై చర్చలు జరిపి,కొంత వరకు ధరలు పెరుగుదల విషయంలో రోల్ బ్యాక్ ఇన్ సాధించారు.

అలాగే ఇటీవలి కాలంలో అనగా తేది 19-05-2022న దాణా ధరను రూ. 2.56కి పెంచినప్పుడు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షతన ముదునూరి నాగ రాజ వర ప్రసాద రాజు-చీఫ్ విప్ మరియు.వడ్డి రఘు రామ్-కో-వైస్ చైర్మన్, అప్సడా, వారితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దాణా తయారీదారులు ధరను వెనక్కి తీసుకునేలా ఒప్పించారు.దీంతో కొంతవరకు ధర అదుపులో పడింది.

అలాగే 08.09.2022 మరియు 19.09.2022 తేదీలలో మరోసారి రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షతన, డాక్టర్ నాగి రెడ్డి-విసి అగ్రికల్చర్ కమిషన్ మరియు .వడ్డి రఘు రామ్-కో-వైస్ చైర్మన్ అప్సడా వారితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశించిన ఫలితాలు ఇవ్వకుండానే ధర పెరుగుదల దృష్ట్యాకిలోకు రూ. 2.60 పెంచడం జరిగింది.


SAKSHITHA NEWS