500 కోట్ల రూపాయలతో వనపర్తి నియోజకవర్గం లో విద్యాభివృద్ధి
హరిజనవాడ పాఠశాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన…………. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే
సాక్షిత వనపర్తి
_
వనపర్తి నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాదాపు 500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు_
వనపర్తి పట్టణంలోని హరిజనవాడ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు
కార్యక్రమానికి హాజరైన ఆయన ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. వనపర్తి నియోజకవర్గంలో పెబ్బేరు, ఖిల్లా ఘనపురం, మామిడిమాడ, పాఠశాలలతో పాటు హరిజనవాడ పాఠశాలను సైతం దత్తతకు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు
ఈ పాఠశాలలను ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు
నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యనిభ్యసించిన వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి పరచనున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా పటిష్టపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అంగన్వాడి కేంద్రాలలో 3వ తరగతి వరకు విద్యనభ్యసించిన అనంతరం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో డిగ్రీ వరకు చదువుకునేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు
నేడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో విద్య వైద్యం నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించమని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు
కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, స్థానిక కౌన్సిలర్లు పాఠశాలల ఉపాధ్యాయులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు