SAKSHITHA NEWS

జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్, కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచి సలహాదారులుగా పని చేశారని, తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని కలెక్టర్ తెలిపారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండేదని, స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని, రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS