వార, పక్ష, మాస పత్రికల సంపాదకులకు అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించాలని, సంపాదకులకు

Spread the love

గౌరవ వేతనం ఇవ్వాలని, సంపాదకులందరికీ స్టేట్ బస్సు పాస్ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు చొప్పవరపు సాంబశివ నాయుడు పిలుపుమేరకు గుంటూరు నగరం కలెక్టరేట్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ సోమవారం నాడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు పలు రాజకీయ పార్టీ నాయకులు,తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయి కృష్ణ, PDSU అధ్యక్షులు ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ మరియు యూనియన్ కమిటీ సభ్యులు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి డి.డి ని పిలిపించి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & రిపోర్టర్స్ యూనియన్ తరుపున ప్రిడియాటికల్స్ ఒకరికి అవకాశం కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మరియు రిపోర్టర్స్ కమిటీ సభ్యులు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ అధ్యక్షులు షేక్ పాషా,ఉపాధ్యక్షులు కొటికల సురేష్, జనరల్ సెక్రటరీ శంకర్, ఆర్గనైజషన్ సెక్రటరీ బాజీ,రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయి కుమార్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాగర్, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page