SAKSHITHA NEWS

దుందిగల్ మునిసిపాలిటీ కార్యాలయంలో పురపాలక చైర్-పర్సన్ శ్రీమతి శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5445.18 లక్షల అంచనా, ఆదాయంతో రూ.5222.85 లక్షల అంచనా వ్యయంతో మరియు రూ.222.33 లక్షల మిగులుతో బడ్జెట్ ను చైర్-పర్సన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ సమావేశంలో 2024-25 యొక్క బడ్జెట్ ను మరియు 2023-24 యొక్క సవరణ బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించింది. బడ్జెట్ సమావేశం అనంతరం చైర్-పర్సన్ మాట్లాడుతూ దుందిగల్ మున్సిపల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నామన్నారు.

దుందిగల్ మునిసిపల్ ప్రాంతాన్ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే వివేకానంద్ మరియు కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశామని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు కౌన్సిల్ సభ్యులతో పాటుగా ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. మున్సిపల్ అభివృద్ధిలో శక్తివంతన లేకుండా కృషి చేస్తామని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మున్సిపల్ పాలకవర్గం సమిష్టిగా ముందుకు సాగాలని తద్వారా మున్సిపల్ అభివృద్ధికి మరియు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసుకొగలమన్నారు.

కౌన్సిల్ లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన 2024-25 యొక్క బడ్జెట్ మరియు 2023-24 యొక్క సవరణ బడ్జెట్ పారదర్శకంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, ఎంతో ఆదర్శవంతంగా తయారు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇట్టి బడ్జెట్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కమీషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ, పి.హెచ్.సి. డా.నిర్మల, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, కుంటి అరుణ నాగరాజు, జక్కుల క్రిష్ణ యాదవ్, ఆనంద్ కుమార్, రమాదేవి, రాము గౌడ్, సాయి యాదవ్, మహేందర్ యాదవ్, బొంగునూరి నవితా శ్రీనివాస్ రెడ్డి, శివానురి నవనీత మల్లేష్, ఎల్లుగారి సత్యనారాయణ, భారత్ కుమార్, నర్సారెడ్డిగారి శ్రీనివాస్ రెడ్డి, పీసరి బాలమని క్రిష్ణ రెడ్డి, మౌనిక విష్ణు వర్ధన్ రెడ్డి, వనితా బుచ్చిరెడ్డి, ఎంబరి లక్ష్మి ఆంజనేయులు, మాదాస్ వెంకటేష్, అర్కల అనంత స్వామి ముదిరాజ్, కొర్ర శంకర్ నాయక్, జోస్ఫిన్ సుధాకర్ రెడ్డి, ఏ.ఈ.ప్రవీణ్, ఆర్.వో సునందా, మేనేజర్ నరసింహులు, మరియు మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….

WhatsApp Image 2024 02 27 at 2.43.43 PM

SAKSHITHA NEWS