ఎల్లమ్మచెరువును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాలలోని కాలనీ ప్రజలు దోమల బెడద ఎక్కువగా ఉందని సమస్యను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ తక్షణమే స్పందించి జి.హెచ్.ఎం.సి ఎంటమాలజి సిబ్బందితో చెరువులోని గుఱ్ఱపుడెక్కను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రగతినగర్ పరిసర ప్రాంతాల నుండి వస్తున్న డ్రైనేజీ నీరు ఎల్లమ్మ చెరువులో కలిసి కలుషితం అవ్వడం వల్ల దోమల బెడద, దుర్వాసన రావడం వంట్టి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.

ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ సహకారంతో సుమారు రెండున్నర కోట్ల నిధులతో పైప్ లైన్ నిర్మాణం చేపట్టి పై నుండి వస్తున్న డ్రైనేజీ నీరును ఎల్లమ్మచెరువులో కలవకుండా దారి మళ్లించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. పైప్ లు వచ్చి ఉన్నాయి కాబట్టి నిర్మాణ పనులు తొందరలో మొదలుపెడతారని అన్నారు. పైప్ లైన్ నిర్మాణం పూర్తయిందంటే ఎల్లమ్మచెరువులో ఒక్క చుక్క డ్రైనేజీ నీరు కూడా కలవదు కాబట్టి చెరువు నీరు శుభ్రంగా ఉండి గుఱ్ఱపుడెక్క పెరగడం, దుర్వాసన రావడం, దోమల బెడద వంట్టి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. అలాగే మన ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవలని కాలనీ ప్రజలకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే దోమల బెడద ఉండదని అన్నారు. ఆలాగే తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, రాజిరెడ్డి, పాండు, వాసుదేవరావు, ఎంటమాలజి సూపర్వైజర్ నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page