కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీ లో నిర్మాణంలో ఉన్న భవనం రిటర్నింగ్ వాల్(అడ్డ గోడ) కూలి పక్కనే ఉన్న కార్మికులు నివసిస్తున్న రేకుల షెడ్స్ పై పడి 7 మంది మృతి చెందిన విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి మరియు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించిన మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమత్ రెడ్డి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ శోభారాణి , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి .ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని,అన్ని విధాలుగా తమ సహాయసహకారాలు అందజేస్తామని తెలియజేశారు. అదే విధంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరమని,ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,రాబోయే వర్షాకాలం దృష్ట్యా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,NMC కాంగ్రెస్ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు కడియాల ఇందిరా,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,సీనియర్ నాయకులు వెంకటేష్,శ్రీనివాసరావు,యువ నాయకులు కోలన్ బాల్రెడ్డి,సీనియర్ నాయకులు, యువ నాయకులు,మహిళా నాయకులు, పోలీస్ అధికారులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download app