SAKSHITHA NEWS

రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని పరికి చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న ధరణి నగర్ మరియు ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని కొన్ని ఇండ్లలోకి నీరు వచ్చి ముంపుకు గురైన కారణంగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముంపుకు గురైన కుటుంబాలకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ చేతులమీదుగా బియ్యము, నిత్యావసర సరుకులను మరియు కూరగాయలను అందించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పరికిచెరువు నాలలోని ప్రవాహ ఉధృతి పెరిగి వరద నీరు రివర్స్ రావడంతో రోడ్లపైకి మరియు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరిందని అన్నారు. గత నలుగుఐదు ఏండ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో పరికిచేరువు పరిసర ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం వరదనీరు అంత క్లియర్ అయ్యిందని అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కృష్ణారావు, రాజబాబు, రాములుగౌడ్, జూపల్లి జనార్దన్ రావు, రమేష్ గౌడ్, సత్యం రావు, పి.స్వరాజ్యం, డి.శ్రీనివాస్, శ్రీకాంత్, వెంకట్, జనయ్య, బాలరాజు, సాయిగౌడ్, శివ, రాజ్యలక్ష్మి, పుట్టం దేవి, రేణుక, సురేఖ, బి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS