వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి

Spread the love

రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్ర నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. పేదవారికి మంచి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పేదవానికి భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటారని, వైద్యం అందుతుందనే భరోసా ప్రజలకు ఇవ్వాలని అన్నారు. ప్రజల అభీష్టం మేరకు ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అభయహస్తం క్రింద ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు ప్రజల గుమ్మంకు చేర్చామన్నారు. ఈ నెల 11న భద్రాచలం శ్రీరాముల వారి సన్నిధిలో 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన ప్రతి మాటను తూ.చ. తప్పకుండా ప్రజలకు అందిస్తామన్నారు.

 ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, ఎస్డీపివో నీలోహన, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page