Division Corporator Avula Ravinder Reddy is running the Kanti Velam Kendra with pride
బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని డివిజన్ *కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
సాక్షిత : స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు నిర్వహించారనే వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేటర్ కంటి వెలుగు కేంద్రానికి వచ్చిన స్థానికులతో మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు వైద్య సిబ్బందికి సూచించారు. దగ్గర చూపు లేనివారికి వెంటనే కళ్లద్దాలను పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. కాగా సిబ్బంది పనితీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఆదరణ పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కంటి సమస్యలకు సంబంధించిన అన్ని పరీక్షలను ఈ శిబిరాల్లోనే చేసి మందులు, రీడింగ్ గ్లాస్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ శిబిరంలో ఇప్పటి వరకు 1704 మంది పరీక్షలకై నమోదు చేసుకోగా అందులో పురుషులు 780కాగా, మహిళలు 924గా నమోదయ్యారు. అందులో 697 మందికి అద్దాలు పంపిణీ చేయగా, సుమారు 413 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందించవలసి ఉందని తెలిపారు. అవసరం ఉన్న వారికి 15-20 రోజుల్లో వాటిని ఇంటికి పంపించేలా చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ నీరజ్, DO నమ్రత,సూపెర్వైసోర్ ప్రేమసుందరి, ఏ ఎన్ ఎం పద్మ,మంజుల, ఆశావర్కర్ వినోద,కనకమ్మమా మరియు GHMC సిబ్బంది తో పాటు స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మందడి సుధాకర్ రెడ్డి,MS కుమార్,ఆదిమూల నాగేష్,బాజని నాగేందర్ గౌడ్,ఎలిజాల యాదగిరి,సింగజోగి రామేశ్వర్,గౌతమ్ తదితరు పాల్గొనడం జరిగింది….