SAKSHITHA NEWS

District-wide development funds should be utilized properly.

జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి నిధులు సక్రమంగా వినియోగించాలి,

జిల్లాలో మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ బాధ్యతలు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

మేడ్చల్ జిల్లా సాక్షిత ప్రతినిధి;-
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులను మండలాల వారీగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.

కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో కలిసి అభివృద్ధి నిధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో 15 మండలాలు ఉండగా మండలానికి జిల్లా స్థాయి అధికారులను ఒక్కో మండలానికి ఒక్కొక్కరిని ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు తమకు కేటాయిచినా మండలంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిధులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ సమావేశంలో అధికారులకు సూచించారు.

ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో ఇప్పటి వరకు ఎన్ని పనులు మంజూరయ్యాయి ? ఎన్ని పనులు ఏఏ స్థాయిలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకొని వాటిని వేగవంతం చేసి పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ హరీశ్ సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే మండల ప్రత్యేక అధికారులు వారికి సంబంధించి కేటాయించిన మండలాల్లో పనులు, ఖర్చులకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

అలాగే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చేపట్టిన పనులపై కలెక్టర్ వివరాలను తెలుసుకొన్నారు. జిల్లా స్థాయి అధికారులు మండల ప్రత్యేకాధికారులుగా వ్యవహరించడం వల్ల ఆయా మండలాలు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ హరీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రతినెలా రివ్యూ (సమీక్ష) సమావేశం నిర్వహించి చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలుసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) మోహన్రావు, జిల్లా స్థాయి అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి (ఎంపీడీవో) అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS