SAKSHITHA NEWS

SPS నెల్లూరు జిల్లా

మనుబోలు, వెంకటాచలసత్రం పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS.,

 మనుబోలు, వి.సత్రం పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్ మ్యాప్, చార్ట్ లను, స్టేషన్ పరిధిలో ఉన్న హైవే, నేర మరియు శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించిన యస్.పి. గారు.
 అనంతరం గ్రేవ్ కేసుల CD ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డుల క్షుణ్ణంగా పరిశీలించి తగిన ఆదేశాలు జారీ.
 హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు.
 జిల్లా వాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం.
 వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాడు.. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు. నివారణకు తగిన చర్యలు తీసుకుటున్నాం..
 మిస్సింగ్ కేసులలో సత్వరమే స్పందించి, సాంకేతికత ఆధారంగా చేధించాలని ఆదేశాలు.
 గంజాయి, మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలి.
 ప్రజలకు LHMS, దిశ యాప్, జాబ్స్, లోన్ యాప్స్, బిట్ కాయిన్, అనవసర లింకులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఆదేశాలు.
 దర్యాప్తులో ఉన్న కేసులలో సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని, సదరు కేసులలో తగిన సూచనలు సలహాలు.
 దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలి.
 శిధిలావస్థలో ఉన్న వాహనాలను కోర్టు అనుమతితో వేలం వేయాలని ఆదేశాలు.
 పోలీసు స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నెముక అని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.23.05.2023.

WhatsApp Image 2023 05 23 at 7.08.41 PM

SAKSHITHA NEWS