స్పందన కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన ప్రజల వద్ద నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ
సమస్య ఏదైనా చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి, పరిష్కారం అందించడానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుందని, సమస్య గూర్చి దిగులు పడకుండా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ గారు అన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, వారి ఫిర్యాదును సానుకూలంగా విని, నిర్ణీత సమయం లోపల చట్టపరిధిలో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈరోజు స్పందన కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులలో
నాగాయలంక నుండి వెంకయ్య అనే వృద్ధుడు వచ్చి తనకున్న ఇద్దరు కుమారులు వృద్ధ దంపతులము అయిన మా ఇద్దరికీ భోజనం పెట్టకుండా, వైద్య ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, అడిగినప్పటికీ ప్రయోజనం లేకుండా దుర్భాషలాడుతున్నారని, న్యాయం చేయమని ఫిర్యాదు
పెనమలూరు నుండి పుష్ప అనే మహిళ వచ్చే తనకు వివాహం జరిగే నాటికి తన భర్తకు చెడు వ్యసనాలు ఉన్న అనే సంగతి దాచిపెట్టి మోసపూరితంగా వివాహం జరిపించారని, కొన్ని నెలలు సజావుగానే ఉన్నప్పటికీ తీవ్రంగా మద్యం సేవిస్తూ శారీరకంగా హింసలకు గురి చేస్తున్నాడని అంతేకాక బయట వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తూ వారి నుండి మాకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నాడని రక్షణ కల్పించి న్యాయం చేయమని ఫిర్యాదు
గుడివాడ నుండి కుమారి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 7 సంవత్సరాలు అవుతుండగా, ఒక కుమార్తె జన్మించిందని, అప్పటినుండి తన భర్త మితిమీరిన అనుమానంతో తీవ్ర వేధింపులకు గురి చేస్తూ పుట్టింటికి పంపించేసాడని, కనీసం కుమార్తెను బతికించుకోవడానికి డబ్బు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఉద్యోగం కి వెళ్దాం అన్నా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు