ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి – కలెక్టర్
చిట్యాల,నార్కట్ పల్లి,నల్గొండ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)
యాసంగి సీజన్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి .వినయ్ క్రిష్ణా రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చిట్యాల,నార్కట్ పల్లి,నల్గొండ మండలం లలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. చిట్యాల మండలం చిట్యాల,వట్టి మర్తి, నేరె డ గ్రామాలలో,నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ,నల్గొండ మండలం అర్జాల బావి,చందన పల్లి, రెడ్డి కాలనీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పి.ఏ.సి.ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయంకు వచ్చిన రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. కొను గోలు కేంద్రాలలో కొనుగోళ్ల తీరు పరిశీలించారు.కొనుగోలు కేంద్రానికి రైతు తీసుకు వచ్చిన ధాన్యం వ్యవసాయ విస్తరణ అధికారి తేమ శాతం పరిశీలించి నిర్ణీత తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోళ్లు నిర్వహించాలని,ఒ.పి.యం.ఎస్ లో వివరాలు నమోదు చేయాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలలో హమాలీ లు కొరత లేకుండా చూసి లోడింగ్ చేయాలని అన్నారు. ధాన్యం విక్రయం కు తీసుకు వచ్చిన వెంటనే ఆన్ లైన్ లో రైతు వివరాలు నమోదు లో ఎటువంటి సమస్య లు తలెత్తకుండా రైతుల భూమి, ఓ.టి.పి.సమస్య వుంటే ముందే పరిష్కరించాలని అన్నారు.
ఆన్లైన్ లో రైతు వివరాలు పరిశీలించి
భూమి సమస్య వుంటే వ్యవసాయ విస్తరణ అధికారి భూమి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని,ఆధార్ తో ఫోన్ నెంబర్ తో అనుసంధానం జరిగిందా పరిశీలించి రైతులకు అవగాహన కలిగించాలని, ఓ.టి.పి సమస్య రాకుండా అనుసంధానం చేయాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఎంతగా మంది రైతులు ధాన్యం తీసుకు వచ్చారు.నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యం ఎంత,కొనుగోలు కేంద్రాల ల్లో సమస్య తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల డి యం.నాగేశ్వర రావు,జిల్లా ఇంఛార్జి సహకార అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ లు, అధికారులు తదితరులు ఉన్నారు.