ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కొనిజర్ల మండలం బస్వాపురం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ ఛార్జ్ హెచ్ఎం బి కృష్ణారావు మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు జాతి నవయుగ – వైతాళికుడు, గొప్ప సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహాజ్ఞత వ్యక్తి. తాను నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని మచ. తప్పకుండా పాటించిన వ్యక్తి అని, స్త్రీ విద్యకై ఉద్యమించిన వారని, గొప్ప మహాను భావుడని కొనియాడారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి నేడు- భారతదేశపు మొట్ట- మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా పని చేసిన జాతి గర్వించదగిన వక్తి అని తెల్పుతూ వారికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమములో పాఠశాల డిప్యూటీ వార్డెన్ ), బి.వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయులు టి. మురళీధర్ రావు, ఇ. నెహ్రూ, బి.అశోక్ కుమార్, వర్కర్స్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page