జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి, పెద్దతాండ, మద్దులపల్లి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లలు ఎంతమంది ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో స్టోర్స్ ను తనిఖీ చేసి, సామాగ్రి నిలువను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం నుండి ఇస్తున్న గుడ్ల నాణ్యతను పరిశీలించారు. గుడ్ల బరువు ను తూకం వేయించారు. అగ్రిమెంట్ ప్రకారం గ్రుడ్ల బరువు వుండేలా చూడాలన్నారు.
అనంతరం పొన్నెకల్ వద్ద పురోగతిలో ఉన్న ఖమ్మం సూర్యాపేట హైవే రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు విస్తరణలో విద్యుత్ స్తంభాల పనులు పూర్తయినట్లు ఒకవైపు రోడ్డు పనులు కొనసాగుతున్నట్లు, నెలాఖరుకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, రేడియం స్టిక్కర్లు ప్రదర్శించాలని అన్నారు.
ఈ సందర్భంగా శిక్షణా సహాయ కలెక్టర్ యువరాజ్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, నేషనల్ హైవే ఇఇ యుగంధర్ రావు, అధికారులు తదితరులు ఉన్నారు.