శివరాత్రి పర్వ దినాన మహేంద్రగిరికి భక్తుల తాకిడి..

Spread the love

గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది.

మహేంద్రగిరికి భక్తుల తాకిడి..

భీముని మందిరంలో ఉన్న శివలింగంకి విశేష పూజలు

పర్లాఖెముండి :

గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది. ఉదయించే సూర్యుడ్ని చూసేందుకు భక్తులు వేచి చూశారు. పూర్వం క్షత్రియులను ఓడించిన అనంతరం పరుశురాముడు ఇక్కడ తపస్సు చేశాడని, పాండవులు వచ్చి పరశురాముని వద్ద విలువిద్య అభ్యసించారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో కుంతీ మందిరం, ధర్మరాజు, అర్జునుని గుహ, మందిరం నిర్మించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

కొండపై ఒడిశా, ఆంధ్రా ప్రజలు
కనులవిందు..

ఇక్కడి ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలరావాలు, ఉదయించే లేలేత సూర్యుని రూపం, మరోపక్క భీముని గుడి దర్శనం కనుల విందు చేస్తుంది. పెద్దపెద్ద రాళ్లతో నిర్మించిన గుడి ముఖ ద్వారం నుంచి లోపలికి భక్తులు వెళ్లి ఓ చిన్న సందు నుంచి బయటికి రావడం ఇక్కడి ప్రత్యేకం. అలా చేయడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. సూర్యోదయం సముద్రగర్భం నుంచి పుట్టుకొచ్చినపుడు సువర్ణ శోభితంగా కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పర్వతంపై ఉన్న మందిరాలను దర్శించుకునేందుకు గజపతి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 80 శాతం మంది మహేంద్రగిరి పర్వతానికి వచ్చి దర్శించుకున్నారు.

Related Posts

You cannot copy content of this page