పసుమర్రు వాసుల దశాబ్దాల కష్టాన్ని తీర్చాం
రూ.6 కోట్ల నిధులతో సమస్యకు పరిష్కారం చూపాం
ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో పల్లెసీమలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
చిలకలూరిపేట పట్టణ శివారు పసుమర్రు గ్రామానికి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన మంచినీటి పథకాన్ని మంత్రి విడదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పసుమర్రు గ్రామానికి మంచినీటి సమస్య దశాబ్దాలుగా ఉందని తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.6 కోట్ల నిధులతో మంచినీరు అందించే పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రోజుకు ఒక మిలియన్ లీటర్ల నీటిని గ్రామస్తులకు అందించే సామర్థ్యంతోట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఏర్పాటుచేశామని చెప్పారు. ఈ పథకం వల్ల ఏకంగా 7వేల మంది జనాభాకు మంచినీటి అవసరాలు తీర్చే వెసులుబాటు కలిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.