
నా పేరును నాశనం చేశారు.. నేను కోర్టుకు వెళ్తాను” -సైఫ్ దాడిలో అనుమానుతుడి ఆవేదన!
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో కొత్త అప్‌డేట్‌లు వస్తున్నాయి. అరెస్టయిన దుండగుడితో పాటు కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అయితే తరచుగా చర్చించబడే మరో పేరు ఆకాష్ కనోజియా, సైఫ్ దాడి కేసులో అనుమానితుడిగా అరెస్టు చేసినందుకు అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసినందుకు ఆకాష్ కనోజియాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీలో కనిపించిన దుండగుడి ముఖం ఆకాశ్ ముఖంలా ఉండడంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు నేరుగా ఆకాష్‌ను దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అసలు నిందితుడిని గుర్తించిన మూడు రోజుల తర్వాత ఆకాష్‌ని విడుదల చేశారు.
అయితే తనను అరెస్ట్ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఆకాష్. ఈ కేసులో తన పేరు పొరపాటుగా రావడంతో ఉద్యోగం పోయింది.. వివాహం ఆగిపోయింది. పోలీసుల పొరపాటు అతనితో పాటు అతని కుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపింది.
“ముంబయి పోలీసులు నన్ను ఉదయం 10:30 గంటలకు పట్టుకున్నారు, ముంబై పోలీసులు రాత్రి 9:30 గంటలకు వచ్చి నన్ను రాత్రంతా అక్కడే ఉంచి విచారణ చేశారు, మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విడుదల చేశారు. పొరపాటున నిన్ను పట్టుకుంటే వెళ్లిపోవచ్చు అని పోలీసులు చెప్పారు” అని అన్నాడు.
“నాపట్ల చాలా తప్పు జరిగింది. ఇలా ఎవరికీ జరగకూడదు. నేను గత 4 రోజులుగా ఇంటికి వెళ్ళడం లేదు. నాకు అమ్మ, నాన్నలను కలవడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను నిర్దోషిని నాకు అన్యాయం జరిగింది. నా మానిసిక పరిస్థితి సరిగా లేదు. నా వైరల్ ఫోటో, వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలి. నా పేరును నాశనం చేస్తున్నాయి. ఫోటో, వీడియో తొలగించకపోతే నేను కోర్టుకు వెళ్తాను.” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app