
మహా కుంభమేళా.. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా!
న్యూ ఢిల్లీ:
ఈరోజే ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించా లన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్‌కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమచారం..
దీనిపై యుపీ సర్కారు అధికారిక ప్రకటన చేయ లేదు.. కానీ పదుల సంఖ్య లో భక్తులు గాయపడ్డారు.. వివిధ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. మహాకుంభ్ సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట లో 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం..
అర్ధరాత్రి తర్వాత.. సంగం ఘాట్ దగ్గర విపరీతమైన రద్దీతో క్యూలైన్‌లో ఒక్క సారిగా తోపులాట జరిగిం ది.. బారికేడ్ విరగడంతో పక్కనే నిద్రిస్తున్నవారిపై జనం పడిపోయారు. తొక్కిసలాట, హాహాకారాల తో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.. సెక్టార్-4లో తెల్లవారు జామున ఒంటి గంట 30 నిమిషాలకు తొక్కిసలాట జరిగింది.
స్వరూప్ రాణి ఆసుపత్రికి మృతదేహాలను తరలిం చారు. మృతుల్లో పిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై మాత్రం యూపీ సర్కార్ అధికారిక ప్రకటన చేయా ల్సి ఉంది..ప్రయాగ్‌రాజ్ తొక్కిస లాటపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app