SAKSHITHA NEWS

హైదరాబాద్‌ లోని భారత కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఐపీఈ తో కిట్స్ వరంగల్ కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యూ)

ఉమ్మడి వరంగల్ జిల్లా జోనల్ ఇన్చార్జి

ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, నిర్మాణ సామర్థ్య నైపుణ్యన్ని ప్రోత్సహించే సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుంది అని హైదరాబాద్‌ లోని ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస మూర్తి మరియు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యూ) ఎంబిఎ విభాగం హైదరాబాద్‌ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ ప్రైజ్ (ఐపిఇ-)తో ఒక అవగాహన ఒప్పందం (యం ఓ యు) పై సంతకం చేసిందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. ఐపిఈ అనేది భారతదేశం లోని విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతిష్టాత్మక సంస్థ ఈ చొరవ విలువైన నిర్వహణ మరియు సాంకేతిక నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం ద్వారా వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుందని, మరియు వారు యువ వర్ధమాన ఇంజనీర్ల ప్రయోజనం కోసం అతిథి ఉపన్యాసాలు, విద్యార్థుల ప్రాజెక్ట్‌ లు, ఆవిష్కరణలను రూపొందిస్తుంది అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ అవగాహన ఒప్పందం విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు, ఫ్యాకల్టీ నిపుణుల చర్చ, పరిశోధన సహకారం, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు మరియు శిక్షణ & నియామకాలపై దృష్టి సారిస్తుందని హైదరాబాద్‌ లోని ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస మూర్తి తెలిపారు. ఇది అధిక ప్యాకేజీ ఉపాధి కోసం విద్యార్థి సంఘంలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది అని తెలిపారు. ఈ వేడుక విజయాన్ని హైదరాబాద్ ఐపీఈ నుండి ఐపీఈ, డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస మూర్తి, ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ వై. రామకృష్ణ, ప్రొఫెసర్ బి. నరేష్ మరియు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ (ఐ3సి), ఇంటర్న్‌షిప్‌లు మరియు ఎంఓయూల ఇన్‌ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి. రఘోత్తమ్ రెడ్డి ఎంబీఏ విభాగాధిపతి ప్రొఫెసర్ పి సురేందర్, కిట్స్ వరంగల్ ఐ3సి ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్‌ లు అవగాహన ఒప్పందాన్ని సంయుక్తంగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, ఫార్మర్ రాజ్య సభ ఎం.పి.& కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి శ్రీ పి. నారాయణ రెడ్డి మరియు అదనపు కార్యదర్శి & హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హైదరాబాద్‌ లోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఐపీఈ వారితో ఎం.ఓ.యూ కుదుర్చు కున్ననందు కు ప్రిన్సిపల్ ని, కిట్స్ వరంగల్ ఐ3సి అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ కె. వేణుమాధవ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. కోమల్‌ రెడ్డి, కెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ పిఆర్‌ఓ డాక్టర్‌ డి. ప్రభాకర చారి, డీన్‌ లు, అన్ని హెడ్‌ లు, ఎంబిఎ ఫ్యాకల్టీ డాక్టర్‌ జి. రత్నాకర్‌, సారక్‌, డాక్టర్‌ సునీతా చక్రవర్తి, డాక్టర్‌ సునీతా చక్రవర్తి, డా. జైపాల్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app