
లో…వోల్టేజితో తరుచూ కాలుతున్న వ్యవసాయ మోటార్లు
—–ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణ గద్దె ధ్వంసం
—-ఆందోళనలో నాగారం రైతులు
ఉమ్మడి వరంగల్ జిల్లా జోనల్ ఇంచార్జీ
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని సూదన్ పల్లి ఫీడర్ కింద గల నాగారం గ్రామంలో లో వోల్టేజి కారణంగా వ్యవసాయ వినియోగం విద్యుత్ మోటార్ లు తరుచూ కాలి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాగారం గ్రామ సూదన్ పల్లి రోడ్డు కు గల తాటివనం లో కొంత మంది రైతులకు చెందిన దాదాపు 75 వ్యవసాయ వినియోగ విద్యుత్ మోటార్ లు ఒక ట్రాన్స్ ఫార్మర్ కలదు.75 మోటార్ లకు ఒక్కటే ట్రాన్స్ ఫార్మర్ ఉండడం వల్ల విద్యుత్ సరిగా అందక, లోవోల్టేజి కారణంగా తరుచూ విద్యుత్ మోటార్ లు కాలి పోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు.
ఈ ట్రాన్స్ ఫార్మర్ కింద మోటార్ లు గల రైతులందరు కలిసి రెండు ట్రాన్స్ ఫార్మర్ లు ఉంటే, ఒక ట్రాన్స్ ఫార్మర్ కింద సగం మోటార్ లు, మరో ట్రాన్స్ ఫార్మర్ కింద సగం మోటార్ లు ఉంటే లో..వోల్టేజి బాధ ఉండదని గ్రహించి, ఈ మధ్య కాలంలో స్థానిక ఎమ్మెల్యే ను కలిసి తమ బాధను చెప్పుకొని, అదనపు ట్రాన్స్ ఫార్మర్ కావాలని కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ట్రాన్స్ ఫార్మర్ మంజూరి చేయించారు. మంజూరి అయిన ట్రాన్స్ ఫార్మర్ ను బిగించుటకు రైతులు పాత ట్రాన్స్ ఫార్మర్ ప్రక్కనే ఒక గద్దెను నిర్మించారు. తమ స్థలంలో గద్దెను నిర్మించారని ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గద్దెను సోమవారం కూల్చివేశారు. దీంతో అక్కడి రైతులు ట్రాన్స్ ఫార్మర్ గద్దెను కూల్చివేయడంపై హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app