SAKSHITHA NEWS

పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

ఉమ్మడి వరంగల్ జిల్లా జోనల్ ఇంచార్జీ

కాశిబుగ్గ ఎనుమాముల మార్కెట్ రోడ్ లో గల ఇండియన్ డిసిపుల్ మిషన్ లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు రోటరీ క్లబ్ హనుమకొండ ఆధ్వర్యంలో శ్రీ చక్ర హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరమును వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం. సాయికుమార్ ప్రారంభించడం జరిగినది. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ “బాలల భవిష్యత్ కు బంగారు పునాదులు వేయాలని తెలిపారు. ఆశ్రమం లోని పిల్లలు వివిధ జబ్బులకు గురి అవుతుంటారు. పిల్లలు అనారోగ్య సమస్యలను త్వరగా గుర్తించి, సరియైన పౌష్టిక ఆహారము అందించి, వ్యాధులకు గురి కాకుండా యాజమాన్యం చూసుకోవాలని తెలిపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఇటువంటి ఆశ్రమాలను ప్రోత్సహిస్తూ వారికి సహకరించాలని తెలిపారు.

పిల్లలు వారి ఆరోగ్య సమస్యలను వైద్యులకు తెలియజేసి, చికిత్సలు చేయించుకోవాలని తెలిపినారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 50 మంది పిల్లలకు ఉచితంగా పరీక్షలు చేసి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన ఔషధాలు అందించడం జరిగినది అని తెలిపినారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం. సాయికుమార్, చీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిల్ రాచర్ల. సురేష్, రోటరీ క్లబ్ హనుమకొండ ప్రెసిడెంట్ ఎస్. ప్రభాకర్ రెడ్డి, కే. ప్రవీణ్ కుమార్, ఏ. విజయ్ కుమార్, జి. నరేష్, బి. రవీందర్ రెడ్డి, జి. రవి కుమార్, జి. నరేష్, శ్రీ చక్ర హాస్పిటల్ మరియు శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ నుండి డాక్టర్ వేముల ప్రసాద్, డాక్టర్ దివ్యధాత్రి, డాక్టర్ గోపీనాథ్ మరియు ఆశ్రమం నిర్వాహకులు స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app