Deputy Speaker Thigulla Padmarao Goud said that the reconstruction of roads will be completed.
సాక్షిత : సికింద్రబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సివరేజే సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో పైప్ లైన్ ల మార్పిడి పనులు పూర్తీ చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మానాన్ని పూ ర్తి చేస్తమని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
సితాఫలమండీ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కుమారి సామల హేమ తో కలిసి అయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. దాదాపు రూ. 85 లక్షల మేరకు విలువ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. మధురానగర్ కాలనీలో రూ.40 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను,
ఎ స్ ఆర్ ఆసుపత్రి వద్ద రూ. 10 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న డ్రినేజి పైప్ లైన్ పనులను, దేడ్ లాక్ బిల్డింగ్ వద్ద రూ. 20 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ నిధుల కొరత ఎదురు కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని, అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారి చేశారు. మధురానగర్ కాలనీ అభివృద్దికి ఇప్పటికీ రూ.5 కోట్ల మేరకు నిధులను వినియోగించామని, కమ్యూనిటీ హాల్ కు అదనంగా రూ.99 లక్షలతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు
. రాజీవ్ నగర్ లో కొత్త రోడ్డు నిర్మించాలని, శ్రీనివాస్ నగర్ లో సివరెజి సమస్యను పరిష్కరించడంతో పాటి ఇబ్బంది కరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని ఆదేశించారు. అదే విధంగా డేడ్ లాక్ బిల్డింగ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.17 లక్షల అదనపు నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో తెరాస యువ నేత తీగుల్ల కిరణ్ కుమార్ గౌడ్, కరాటే రాజు, అధికారులు శ్రీమతి ఆశా లత, శ్రీ కృష్ణ , సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.