SAKSHITHA NEWS

Deputy Speaker Thegulla Padmarao Goud said that it should be made like a new area hospital

సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ లో అన్ని అధునాతన హంగులతో కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రిని కొత్తగా ఏరియా ఆసుపత్రి తరహాలో తీర్చిదిద్దాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. సితాఫలమండీ కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కి కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ దాదాపు రూ.12 కోట్లు మంజూరు చేసిన నేపధ్యంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ అనిల్ కుమార్, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సునిత లతో పాటు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణం తీరు తెన్నులను ఈ సందర్భంగా సమీక్షించారు. అన్ని ఆధునాత హంగులు కొత్త ఆసుపత్రిలో కల్పించాలని, ప్రసూతి సేవలు మొదలు కొని అన్ని వైద్య పరిక్షల నిర్వహణ, శాస్త్ర చికిత్సలకు అనువుగా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అధికారులకు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.


ఓటు హక్కు వినియోగం పై ప్రోత్సాహం
పౌరులు ఓటు హక్కును వినియోగించుకోనేలా అందరూ కృషి చేయాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయంలో స్థానికులతో ప్రతిజ్ఞను నిర్వహించి ఓ పోస్టర్ ను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. కార్పొరేటర్లు శ్రీమతి రాసురి సునీత, కుమారి సామల హేమ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS