అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం

Spread the love

Telangana State in implementation of development and welfare programs

సాక్షిత : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్ లో అగర్వాల్ సమాజ్ సహయత ట్రస్ట్ కు కేటాయించిన మూడు ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం శంఖుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పం అన్నారు.

వివిధ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయల విలువైన భూమి, నిధులను అందజేస్తున్న విషయాన్ని వివరించారు. అగర్వాల్ సమాజ్ కు కూడా కోట్లాది రూపాయల విలువైన 3 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఎన్నో సంవత్సరాల నుండి నగరంలో స్థిరపడి వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అగర్వాల్ సమాజ్ నిర్వాహకులను మంత్రి ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నగరం రోడ్ల అభివృద్ధి, నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనులతో విశ్వనగరం గా రూపుదిద్దుకుందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా, సాగు, త్రాగునీటి సరఫరా, వృద్దులు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని వివరించారు.

తమకు అన్ని విధాలుగా అండగా ఉంది అభివృద్దికి సహకరిస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLC దయానంద్ గుప్తా, ఉప్పల్ MLA సుభాష్ రెడ్డి, కరోడియాల్ అగర్వాల్, ప్రమోద్ కేడియా, రాజేష్ కుమార్ అగర్వాల్, నరేష్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page