సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులను చేపట్టామని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తమదే అగ్ర స్థానమని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో రూ.55 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి శంఖుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ
స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ లో కొత్త జూనియర్, డిగ్రీ కాలేజీల ను తామే నెలకొల్పామని, వాటికీ కొత్త భవనాలను నిర్మించే బాధ్యతను కుడా తామే చేపట్టి ముఖ్యమంత్రి నుంచి రూ.30 కోట్ల మేరకు ప్రత్యేక నిధులను సాధించామని తెలిపారు. అదే విధంగా కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రికి రూ.12 కోట్ల మేరకు నిధులను సమకూర్చి కొత్త భవనాలను నిర్మిస్తున్నామని వివరించారు. సితాఫలమండీ ప్రజల అవసరాలను గుర్తించి ఆయా సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజి కొత్త భవనాల శంఖుస్థాపన, ఆసుపత్రి భవనాల శంఖుస్థాపన తో పాటు మంచి సితాఫలమండీ, టీ ఆర్ టీ క్వార్టర్స్, వీరయ్య గల్లి, బ్రాహ్మణ బస్తే, కింది బస్తీ, మైలారగడ్డ, భవానీ నగర్, మేడి బావి, ఎరుకల బస్తీ, జోషి కాంపౌండ్, వెంకటేశ్వర్ నగర్, ఉప్పరి బస్తి, షాబాజ్ గూడా, శ్రీనివాస్ నగర్, మహమ్మద్ గూడా ప్రాంతాల్లో పర్యటించి కొత్తగా చేపడుతున్న నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం పనులకు సంబంధించిన వివిధ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి యాత్రకు సితాఫలమండీ డివిజన్ పరిధిలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. –