విపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి: జిల్లా బీ ఆర్ ఎస్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 5 : ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, కులాలు మతాల పేరుతో ప్రజలను విచ్చిన్నం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. బౌద్దనగర్ డివిజన్ బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం రాఘవ గార్డెన్స్ లో జరిగింది. హైదరాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ ఇంచార్జ్ డాక్టర్ దాసోజు శ్రవణ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి, బీ ఆర్ ఎస్ యువ నేతలు తీగుల్ల కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, నాయకులు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, సమన్వయ కర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్ లతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సమ్మేళనంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రసంగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును రెండు కండ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్నారని వివరించారు. తెలంగాణా ఉద్యమానికి కంచుకోటగా నిలిచిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ కార్యకర్తల కృషితో తాము విజయాలను సాధించుకున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో నిత్యం ప్రజలతో తాము సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నామని తెలిపారు.
పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ
తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకొనేందుకు. సంపదను కొల్లగొట్టేందుకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని అస్తిరపర్చేందుకు వివిధ శక్తులు పొంచి ఉన్నాయని తెలిపారు. వాటిని బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఎదుర్కోవాలని అయన పిలుపునిచ్చారు. తెలంగాణా రాష్ట్రానికి తమ పార్టీ ప్రభుత్వమే చారిత్రక అవసరమని, మూడో సారి గెలిపించుకోవాలని దసోజు శ్రవణ్ కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్దికి చిరునామాగా ఉందని అయన అన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ మున్ముందు తరాలు సైతం తమ పార్టీనే ఆదరించేలా బీ ఆర్ ఎస్ వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని పద్మారావు గౌడ్, డాక్టర్ శ్రవణ్ లు ఆవిష్కరించారు. చిరకాలంగా పార్టికి సేవలు అందిస్తున్న పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నేతలను ఈ సందర్భంగా ఘంగా సత్కరించారు. –