అస్తమించిన టిడిపి వ్యవస్థను లోకేష్ కు అప్ప చెప్పడానికి, పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని, ఆఖరికి విశాఖ నగరం పై కూడా టిడిపి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ 33 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిడిపి నేతలపై కొడాలి నాని ఫైర్ అయ్యారు.అమరావతిలో టిడిపి వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడని ఆయన ప్రశ్నించారు.విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉంటే విజయసాయి రెడ్డి ఎలా కబ్జా చేస్తున్నారనడం దుర్మార్గమని కొడాలి నాని ఖండించారు.ఒక అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలేం అమాయకులు కాదని వారు అన్ని గమనిస్తున్నారని కొడాలి నాని అన్నారు.
అస్తమించిన టిడిపి వ్యవస్థ
Related Posts
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో
SAKSHITHA NEWS పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో…
సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండి
SAKSHITHA NEWS సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండిజిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. ఆయన ఈ నెల 26వ…