సాక్షిత : తాండూరు పట్టణంలోని 12వ వార్డు పాతకుంటా పార్కులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో మంజూరైన 6 కోట్ల రూపాయల TUFIDC ప్రత్యేక నిధులతో చెప్పటబోయే అభివృద్ధి పనులను తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు ు ముఖ్యఅతిథిగా పాల్గొని సహచర మున్సిపల్ కౌన్సిలర్లతో కలసి పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది…
ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ…తాండూరు పట్టణంలోనే ఇది అతిపెద్ద పార్కని సాయిపూర్,శాంతినగర్ ఇలా రెండు మూడు వార్డుల ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం మరియు పచ్చదనం పెంపొందే విదంగా పాతకుంటా పార్కును అభివృద్ధి పరచడం జరుగుతుందని కాలనీ వాసులు ఎన్నో ఏళ్ల కాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దఎత్తున 6 కోట్ల నిధులు కేటాయించి కాలను సాధ్యం చేసారని,సాయంత్రం సమయాన సీనియర్ సిటీజన్స్,వృద్ధులకు,మహిళలకు అనుగుణంగా వాకింగ్ ట్రాక్ మరియు చిన్నారులకు ఉపయోగకరమైన వాటిని కూడా అమర్చి ఆకర్షణీయమైన మరియు సుందరమైన పార్కుగా చెయ్యడం జరుగుతుందని మురుగునీరుతో ఉన్న పాతకుంటా పచ్చదనంతో ఆహ్లదకరంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయదేవి,పూజ,వరాల శ్రీనివాస్ రెడ్డి,ముక్తర్ నాజ్,వెంకన్న గౌడ్,సోమశేకర్ ,స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, సీనియర్ నాయకులు రంగారావు ,సంతోష్ గౌడ్,రజినీకాంత్,గుండప్ప,ఎర్రంశ్రీధర్,నాగు,ఇతర నాయకులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..