మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్

Spread the love

మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

మరణం లేని మహా నేత.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్ గారని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదేర్యంలో ఘన నివాళి అర్పించారు.

ముందుగా ప్రకాశ్ నగర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీపీలు, జెడ్పీటీసీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ర్లు, వైసిపి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం రామిరెడ్డిపేట పాత సమితి ఆఫీస్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి ప్తన్నంలోని ప్రముఖ డాక్టర్లతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సత్తెనపల్లి రోడ్ లోని బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, మిట్టబజార్, పెద్ద చెరువులో గల 31,25,26 వార్డుల్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తో కలిసి పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం జొన్నలగడ్డ- రంగారెడ్డి పాలెం మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి , ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రంగారెడ్డి పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన కాజ్ వే ను ప్రారంభించారు.

అనంతరం ఆర్టీసి యూనియన్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో, షాలెం నగర్, ప్రకాష్ నగర్, రిక్షా సెంటర్ ఎల్లో వైఎస్సార్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేసి.. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

అనంతరం రొంపిచర్ల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ చూపిన బాటలో.. జగనన్నతో కలిసి అడుగులేస్తూ.. ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతామని అన్నారు. 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం తో రూపుదిద్దుకున్న ప్రాజెక్టులు ఇలా ప్రతి చోట వైఎస్సార్ గారే ఉన్నారన్నారు. మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్ అని అన్నారు.

ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ… పేదల పెన్నిదిగా రాజశేఖర్ రెడ్డి వెలుగొందారని, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు, అందించిన పరిపాలనతో అందరి మనసుల్లో ఎప్పటికీ స్థిర స్తాయిగా నిలిచిపోతారని తెలిపారు.

అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ… వైఎస్ఆర్ పేదల మనిషి అని.. పేదవారికి కష్టం వస్తే చలించిపోమే చల్లని మనసున్న మారాజు అని కొనియాడారు. ఆయన ఎక్కడికీ పోలేదని.. పండే పంటలో, కురిసే వర్షంలో, వీచే గాలిలో.. ప్రతి చోట వైఎస్సార్ ఉన్నారు అని అన్నారు.

Related Posts

You cannot copy content of this page